Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2016 11:03:40
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ?కబాలి? సినిమా గురించి ఇప్పుడు సౌతిండియన్ సినీ అభిమానులంతా ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆకాశాన్నంటే అంచనాలతో రేపు విడుదలవుతోన్న ఈ సినిమా, రిలీజ్‌కు ముందు కళ్ళు చెదిరే ప్రీ బిజినెస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రజనీని దేవుడిలా కొలిచే తమిళనాడులోనే కాక, ఆయనకు తిరుగులేని క్రేజ్ ఉన్న తెలుగునాట కూడా ఈ సినిమా బిజినెస్ అదిరిపోయింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పాటు సాటిలైట్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.
మాకు అందిన సమాచారం ప్రకారం ?కబాలి? సాటిలైట్ హక్కులను ఓ థార్డ్ పార్టీ సుమారు 8 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇక ఈ హక్కులను సొంతం చేసుకునేందుకు ఇప్పుడు పలు ప్రముఖ టీవీ చానెల్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో బిజినెస్ చేయడమనేది ట్రేడ్ పండితుల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4000 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది.

,  ,  ,  ,  ,  ,