Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2016 11:14:28
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి సక్సెస్ కొట్టిన వాళ్లంతా హీరోయిన్లు మాత్రమే. మేల్ ఆర్టిస్టుల్లో బాలీవుడ్ లో ఎవరూ సెటిల్ కాలేకపోయారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి - తర్వాత రామ్ చరణ్ - లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ లు కూడా అతీతం కాదు. అప్పట్లో నాగార్జున కూడా హిందీ సినిమాల్లో కనిపించాడు కానీ.. వాటితో పెద్దగా ఒరిగిందేమీ లేదని చెప్పాలి.

కానీ మహేష్ బాబు బావ సుధీర్ బాబు మాత్రం ఓ సూపర్ ఎఫర్ట్ తో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటివరకూ ఇలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు భిన్నంగా.. బాఘీ మూవీతో విలన్ గా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ ఇవాళే. ఇప్పటికే టీజర్ లు - ట్రైలర్ లతో యాక్షన్ పార్ట్ ను ఇరగదీసేయడమే కాదు.. స్పెషల్ గా సుధీర్ బాబుపైనే ఓ టీజర్ కూడా ఇచ్చారు. సుధీర్ బాబు ను రాఘవగా పరిచయం చేస్తున్నారంటూ ఇచ్చిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ నుంచి వచ్చింది.

ఇప్పటివరకూ ఉన్న హైప్ ప్రకారం చూస్తే.. బాలీవుడ్ లో అరంగేట్రంలోనే సుధీర్ బాబు సంచలనం నమోదు చేస్తాడనే అనిపిస్తోంది. ఓ మూవీ కోసం బాడీని భారీగా పెంచి కండలు మెలితిప్పి అత్యంత క్రూరమైన విలన్ గా కనిపిస్తూ.. హిందీ సినీ పరిశ్రమలో పాగా వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. మరి రిజల్ట్ అయితే మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

,  ,  ,  ,  ,  ,