Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 14:03:27
facebook Twitter Googleplus
Photo

అరంగేట్రంతోనే విలన్ కేరక్టర్లో అదరగొట్టేసి.. అన్ని భాషల మూవీమేకర్స్ ని అట్రాక్ట్ చేశాడు కబీర్ దుహాన్ సింగ్. జిల్ మూవీ తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టేశాయి. ఏడాదిన్నర సమయంలో 10 సినిమాలు చేసేస్తే.. అన్నింటిలోనూ రౌడీ వేషాలు.. విలన్ కేరక్టర్లే. కానీ మొదటిసారిగా కబీర్ కు పాజిటివ్ రోల్ ఆఫర్ రావడంతో ఫుల్లు హ్యాపీ అంటున్నాడు.

హేభా పటేల్ లీడ్ రోల్ లో చేస్తున్న ఏంజెల్ మూవీలో కబీర్ దుహాన్ సింగ్ ను ఓ కీలకమైన పాత్రకు ఎంపిక చేశారట. తన రోల్ సర్ ప్రైజింగ్ గా ఉంటుందని.. మొదటిసారిగా బ్యాడ్ ఫెలో కేరక్టర్ కాకుండా స్పెషల్ రోల్ చేస్తున్నానని చెప్పాడు కబీర్. కొత్త టైపు కేరక్టర్ చేస్తుండడంతో బోలెడంత కిక్ వస్తోందన్న ఈ విలన్.. త్వరలో హీరోగా కూడా అరంగేట్రం చేసేస్తున్నానని అన్నాడు. కొత్త డైరెక్టర్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ హారర్ మూవీలో.. మేల్ లీడ్ రోల్ కు కబీర్ ను ఫైనల్ చేశారట.

ఈ మూవీలో హీరోయిన్ కి ప్రాధాన్యత ఉన్నా.. తనకు మొదటిసారిగా పూర్తిస్థాయి పాజిటివ్ రోల్ చేసే ఛాన్స్ రావడం మాత్రం సంతోషంగా ఉందన్న కబీర్.. డిఫరెంట్ కేరక్టర్లు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటనని చెప్పాడు. త్వరలో హెబ్బులి మూవీతో కన్నడ ఇండస్ట్రీలో కూడా విలన్ గా అరంగేంట్రం చేసేస్తున్నాడీ జిల్ విలన్

,  ,  ,  ,