Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 12:54:58
facebook Twitter Googleplus
Photo

హ్యాపీ డేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఇప్పుడు ఏజ్ పెరిగాక క్రేజ్ తగ్గి.. కుర్రాడు పెళ్ళి పనుల మీద ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ఏదో ప్రాజెక్టులు బిగిన్ అవుతున్నాయ్ అంటున్నాడు కాని.. అవి చాన్నాళ్ల నుండి పట్టాలెక్కట్లేదు. ఇప్పుడు సడన్ గా ఏదో కొత్త ప్రయత్నం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కుర్రాడు.

''తుమ్సే కెహనా థా'' పేరుతో ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఒకటి ఇతగాడే ముందుకు తీసుకొస్తున్నాడు. మామూలు ఆల్బమ్ కాదు ఒక రొమాంటిక్ ఆల్బమ్ అంటున్నాడు. జోయెల్ ముఖర్జీ అందించిన కొన్ని ప్రైవేట పాటలకు.. కౌశిక పెగళ్లపాటి అనే దర్శకుడు మాంచి పాటలు పిక్చరైజ్ చేశాడట. త్వరలోనే వీటిల్ని విడుదల చేస్తానంటున్నాడు వరున్. అంటే బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సోనాక్షి వంటి వారు ఎలాగైతే తమ వీడియో సింగిల్స్ రిలీజ్ చేసుకున్నారో.. ఎలాగైతే కొంతమంది యంగ్ హీరోలు స్పెషల్ ఆల్బమ్ సాంగుల్లో నటిస్తున్నారో.. ఆ తరహాలో వరుణ్ కూడా ఒక స్టెప్ వేస్తున్నాడు.

మరి మనోడు పాటలు పాడుంటే ఓకె కాని.. లేకపోతే ఈ ఆల్బమ్ వలన పెద్ద ్యూజ్ ఏముంది గురూ? మేబి రొమాంటిక గానాలతో యూత్ కు మళ్ళీ దగ్గరై యూత్ ఫుల్ హీరోగా జెండా ఎగరేద్దాం అనుకుంటున్నాడేమో!!

,  ,  ,  ,  ,