Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 11:38:33
facebook Twitter Googleplus
Photo

విశ్వనటుడు కమల్ హాసన్.. ఈ మధ్య తన ఆఫీస్ లోనే ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 20 ఏళ్లుగా నడుస్తున్న ప్రాంతంలోనే కాలు జారి పడిపోవడంతో.. రెండు నెలలుగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే.. ఆ రోజు ఏం జరిగిందనే సంఘటనపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు కానీ.. దీని గురించి తనే వివరించే ప్రయత్నం చేశారు కమల్ హాసన్.

20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా.. తనకు తగిలిన దెబ్బ చిన్నదే అనుకున్నారట కమల్. అయితే.. మొదట కాలు.. ఆ తర్వాత వెన్ను.. నొప్పి పుడుతున్న తీరు చూసి పెద్ద దెబ్బలే తగిలాయని అర్ధమైందట. అయితే.. ఆ సమయంలో తనను 'జీ' కాపాడ్డంతోనే బతికి బట్ట కట్టానన్నది కమల్ ఉవాచ. ఇదంతా కమల్ రీసెంట్ గా రాసిన బ్లాగ్ లో వివరించారు. అయితే.. ఇప్పుడు కమల్ చెప్పిన జీ ఎవరన్నదే అసలు పాయింట్. దీనిపై పెద్దగా డిస్కషన్ అక్కర్లేదు. ప్రస్తుతం కమల్ తో సహజీవనం చేస్తున్న గౌతమినే.. ఈ జి చెప్పేయచ్చు. పైగా 'జి' అంటే గౌతమి అని ఆయనే బ్లాగులో భారీగా వివరించారులే

శృతి హాసన్ తల్లి సారికతో కమల్ విడిపోగా.. గౌతమి కూడా తన భర్తకు డైవోర్స్ ఇచ్చేశాక.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారనే సంగతి తెలిసిందే. ది ఫాల్ అండ్ రైజ్ అంటూ కమల్ రాసిన బ్లాగ్ లో.. యాక్సిడెంట్ జరిగిన రోజు ఆయనపడ్డ బాధను అక్షర రూపంలో చదవవ్చు.

,  ,  ,  ,  ,