Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 10:33:50
facebook Twitter Googleplus
Photo

ఈ సినిమా టైటిల్ కోసం.. ఫస్ట్ లుక్ కోసం.. టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూశారు అభిమానులు. వాళ్లనలా చాలా కాలం నిరీక్షింపజేసి.. వాయిదాలతో పలుమార్లు తీవ్ర నిరాశకు గురిచేసి.. చివరికి ఆ విశేషాల్ని బయటపెట్టారు. ఐతే స్పైడర్ టీజర్ వచ్చి నెల రోజులవుతోంది. సినిమా రిలీజయ్యేదేమో సెప్టెంబరు ఆఖర్లో. అంటే ఇంకా మూడు నెలల పాటు అభిమానులు ఎదురు చూడాలి. ఈ లోపు కేవలం ఒక ట్రైలర్ తో అభిమానుల ఉత్సాహాన్ని నిలబెట్టాలంటే కష్టం. అందుకే ట్రైలర్ కంటే ముందు రెండో టీజర్ రిలీజ్ చేద్దామని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

స్పైడర్ తొలి టీజర్ లోని షాట్ సినిమాలో భాగం కాదు. టీజర్ కోసమే దాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించారు. దానికి విజువల్ ఎఫెక్ట్స్ జోడించారు. ఇది ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచింది. ఐతే ఈసారి సినిమాలోని సన్నివేశాలతో ఒక టీజర్ తీర్చిదిద్ది దాన్ని జులై మధ్యలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా స్పైడర్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయాలన్న ప్లాన్ ఉంది. ఈ లోపు అభిమానుల్లో రెండో టీజర్ ఉత్సాహం నింపుతుందని.. ఇలా చేయడం వల్ల సినిమాకు ప్రమోషన్ పరంగానూ కలిసొస్తుందని భావిస్తున్నారట

,  ,  ,  ,