Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2017 14:30:26
facebook Twitter Googleplus
Photo

చందమామ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది నటి కాజల్ అనే చెప్పాలి. లక్ష్మి కల్యాణం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ జయపజయలతో సంబంధం లేకుండా ఛాన్సులను దక్కించుకుంటోంది. మూడు పదుల వయోసొచ్చినా ఇంకా అందంలో ఏ మాత్రం తేడా రానివ్వకుండా చూపరులను ఆకట్టుకుంటోంది. అలాగే కుర్ర హీరోలతోనూ జోడి కడుతూ.. రొమాన్స్ చేస్తోంది.

అయితే ఈ మధ్య అమ్మడికి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చినా సరైన విజయాలు దక్కడం లేదు. సినిమా ప్రభావమో మరి ఇంకెంటో తెలియదు గాని గత కొంతకాలంగా అమ్మడికి స్టార్ హీరోల సినిమాలు నిరాశపరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 తప్పితే అన్ని డిజాస్టర్స్ గా నిలించాయి. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా కాజల్ కి హిట్ ఇవ్వలేకపోయాడు. చివరికి మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో అలా వచ్చి అలా వెళ్ళిపోయినా కూడా హిట్ అదృష్టం దక్కలేదు. ఇక కోలీవుడ్ స్టార్ హీరోలైన సక్సెస్ గట్టెక్కిస్తారేమో అనుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. రీసెంట్ గా అక్కడి 100 కోట్ల బాక్స్ ఆఫీస్ హీరో అజిత్ కూడా వివేగం సినిమాతో అమ్మడికి అపజయాన్నే ఇచ్చాడు.

ఇప్పుడు చివరగా మరో వందకోట్ల బాక్స్ ఆఫీస్ ధీరుడితో అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న మెర్సల్ చిత్రంలో విజయ్ కి జోడిగా కనిపించనుంది. ఈ సినిమా తెలుగులో అదిరింది అనే టైటిల్ తో విడుదల కానుంది. మీరు చూస్తున్న ఆ స్టిల్ సదరు సినిమాలోదే. విజయ్ కూడా ప్రస్తుతం మంచి సక్సెస్ రూట్ లో లేడనే చెప్పాలి. మరి అతనైన కాజల్ కి హిట్ ఇస్తాడో లేదో? ఆల్రెడీ 50 సినిమాలు పూర్తి చేసిన కాజల్.. హీరోయిన్ గా ఇంకో 50 చేస్తాను అంటోంది.

,  ,  ,  ,  ,