Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 13:42:33
facebook Twitter Googleplus
Photo

150 విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథగా ఈ మూవీ తెరకెక్కనుంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఇంతవరకు ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారు. రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభించకపోవడంతో ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6 నుంచి ఈ పిక్చర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా తీయాలని అనుకుంటున్నా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దీనికి సంబంధించి ఏర్పాట్లలో ఉన్నాడని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

సైరా నరసింహరెడ్డి సినిమాకు బాగా క్రేజ్ తెచ్చింది ఈ సినిమా కోసం నటించనున్న తారాగణం. ఈ భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. శాండల్ వుడ్ హీరో సుదీప్.. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కూడా ఇందులో నటించనున్నారు. నయనతార హీరోయిన్ రోల్ చేస్తోంది.

,  ,  ,  ,  ,  ,