Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2017 11:48:29
facebook Twitter Googleplus
Photo

#wkkb అనే హ్యాష్ ట్యాగ్ ప్రపంచం అంతా వైరల్ అయిపోయింది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్నకు ఆల్రెడీ ప్రజలకు మీనింగ్ తెలిసిపోయింది. అంతకంటే మునుపే.. అసలు కట్టప్ప బాహుబలిని పొడిచే ఆ షాట్ ఒకటి ఐకానిక్ గా మారిపోయింది. అందుకే చాలామంది హీరో హీరోయిన్లు అప్పట్లో ఆ ఫోజును ఇమిటేట్ చేస్తూ చాలా ఫోటోలే పెట్టారు.

అయితే ఇప్పుడు మాత్రం.. వెండితెరపై బాహుబలిని కట్టప్ప పొడిచేస్తే.. ఇక్కడ మాత్రం నేను పొడిచేస్తున్నాను అంటూ సెలవిచ్చాడు వరుణ్ దావన్. ఈ యంగ్ బాలీవుడ్ హీరో ఇప్పుడు ప్రభాస్ తో కలసి జిమ్మింగ్ చేస్తున్నాడట. అసలు ప్రభాస్ ముంబాయ్ లో వీళ్లతో టైమ్ ఎందుకు స్పెండ్ చేస్తున్నాడో తెలియదు.. ప్రభాస్ ను పొడిచేస్తున్నట్లు ఒక ఫోటో దిగి.. అక్కడ కట్టప్ప ఇక్కడ నేను మాత్రం ఈ పని చేయగలిగాం అంటూ చెప్పాడు వరుణ్. అంతేకాదు.. అసలు తాను చూసిన స్టార్లందరిలోకి ప్రభాస్ చాలా కూల్ పర్సన్ అని.. డౌన్ టు ఎర్త్.. అంటూ కొనియాడాడు.

ఇకపోతే ప్రభాస్ ఇలా బాలీవుడ్ జనాభాతో హ్యాంగవుట్ అవ్వడం బట్టి చూస్తుంటే.. మనోడు త్వరలోనే బాలీవుడ్ తెరంగేట్రం చేయనున్నాడనే విషయం క్లియర్ అవుతోంది. పైగా వీరంతా కరణ్ జోహార్ గ్యాంగ్ కాబట్టి.. ష్యూర్ గా సినిమా పడేలానే ఉంది.

,  ,  ,  ,  ,