Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2016 17:37:19
facebook Twitter Googleplus
Photo

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది. కెరీర్ ఏదో డైలమాలో పడిందని అనుకున్న టైంలో.. పవన్ - మహేష్ లతో సినిమాలు చేస్తూ తన స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది. అదే టైంలో బాలీవుడ్ డ్రీమ్స్ ని కంటిన్యూ చేస్తోంది. ఒకటి రెండు సూపర్ హిట్స్ ఉన్నా కూడా.. ఇప్పటివరకూ హిందీ సినిమాల్లో చందమామకి అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి. కానీ ఇప్పుడు దో లఫ్జోం కి కహానీ అనే మూవీ వస్తోంది. ఈ సినిమాతో.. కాజల్ అమాంతం చాలా మెట్లు ఎక్కేయాలని డిసైడ్ అయిపోయింది.

ఆల్వేస్ అనే కొరియన్ మూవీని బేస్ చేసుకుని దో లఫ్జోంకీ కహానీ తెరకెక్కుతోంది. ఇందులో రణ్ దీప్ హూడా సరసన నటిస్తోంది చందమామ. స్టోరీ ప్రకారం ఈమెది గుడ్డి యువతి. వీరిద్దరి మధ్య ప్రేమాయణమే ఈ సినిమా. అయితే.. ఈ మూవీ ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుటోంది. రణ్ దీప్ తో కాజల్ లిప్ లాక్ చేసిన సన్నివేశం... చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

వేలంటైన్స్ డే నాడు రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో.. ఇంతకు మించిన థ్రిల్ మరొకటి ఉందంటున్నారు. అదే కాజల్ - రణ్ దీప్ పల ఇంటిమేట్ సీన్. మొదటిసారిగా రన్ టైం ఎక్కువగా ఉండే బెడ్ రూమ్ సీన్ లో చేసిందట కాజల్. ఈ సీన్ చాలా బాగా వచ్చిందని యూనిట్ అంటోంది. ఈ ఒక్క సీన్ క్లిక్ అయితే దో లఫ్జోం కీ కహానీ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారంటే.. ఏ రేంజ్ లో బెడ్ రూమ్ సీన్ ని తెరకెక్కించారో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ తర్వాత బాలీవుడ్ లో తన రేంజ్ మారిపోతుందని.. కాజల్ కూడా అనుకుంటోంది.

,  ,  ,