Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jul-2016 11:50:54
facebook Twitter Googleplus
Photo

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినా ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. కాజల్ అగర్వాల్ను ఫైనలైజ్ చేశారంటూ వచ్చిన వార్తలను ఈ చిత్రం యూనిట్ వర్గాలు తోసిపుచ్చాయి.

చిరుకు జోడీగా కాజల్ పేరు పరిశీలనలోకి వచ్చినా ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. బిజీ షెడ్యూల్ కారణంగా కాజల్ ఈ సినిమాలో నటించకపోవచ్చని తెలిపారు. తమిళంలో అజిత్ కుమార్ సరసన నటించేందుకు కాజల్ ఇటీవల సంతకం చేసిందని, ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి బల్గేరియాలో నెలరోజులకుపైగా జరగనుందని చెప్పారు. దీంతో చిరు సినిమాకు కాజల్ డేట్స్ ఇవ్వడం కుదరకపోవచ్చని తెలిపారు.

తమిళంలో విజయం సాధించిన కత్తి సినిమాను చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు తనయుడు హీరో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,  ,