Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 10:19:58
facebook Twitter Googleplus
Photo

రానా కాజల్ అగర్వాల్ జంటగా నటించిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఆగస్ట్ 11న విడుదల కానుంది. విడుదల తేదీకి ఇంకా నెల రోజుల సమయమే ఉండడంతో.. ప్రచారంలో వేగం పెంచేసింది మూవీ యూనిట్.

ఈ మధ్య కాలంలో తేజ తెరకెక్కించిన ఏ చిత్రానికి రానంత హైప్.. నేనే రాజు నేనే మంత్రిపై క్రియేట్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. వీటిని మరింతగా పెంచేందుకు తేజ రకరకాల టెక్నిక్స్ అవలంబిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి.. కథ కథనాలతో పాటు డైలాగ్స్ హైలైట్ అనే సంగతి అర్ధమయిపోగా.. ఇప్పుడు కాజల్ తో రానా రొమాన్స్ ను కూడా ప్రత్యేకించి ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాజాగా రానా-కాజల్ ఇద్దరి పోస్టర్ చూస్తుంటే.. ఈ జంట మధ్య రొమాన్స్ ఏ స్థాయిలో పండించారో అర్ధమవుతుంది.

తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో సినీ అరంగేట్రం చేసిన కాజల్.. తన తొలి దర్శకుడికి బ్రేక్ ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించిందనే సంగతి అర్ధమవుతోంది. తమ జంట మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ అనుబంధాన్ని ఒక్క పోస్టర్ తోనే చూపించేశారంటే.. కాజల్ -రానాలు ఎంత క్లోజ్ గా ఉన్నారో చెప్పచ్చు.

,  ,  ,  ,