Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2017 14:40:55
facebook Twitter Googleplus
Photo

డ్రగ్స్ కేసు దర్యాప్తు ఏ రోజు ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. సోమవారం ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని పోలీసులు అరెస్ట్ చేయటం.. అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది.

దీంతో.. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారటమేకాదు.. రోనీతో కాస్త క్లోజ్ గా ఉన్న కాజల్ ఫోటో మీడియాలో ప్రముఖంగా హైలెట్ అయ్యింది. ఈ ఇష్యూ మీద తాజా ట్విట్టర్లో ట్వీట్ చేసింది కాజల్.

సుదీర్ఘ వివరణ ఇస్తూ.. రోనీతో తనకున్న రిలేషన్ గురించి చెప్పటంతో పాటు.. తాజా ఉదంతం తననెంతగా షాక్ కు గురి చేసిందో చెప్పుకొచ్చింది. రోని ఇష్యూ తనను షాక్ కు గురి చేసినట్లుగా కాజల్ పేర్కొంది. సమాజానికి హాని కలిగించే ఎలాంటి చర్యలకు తాను మద్దతు ఇవ్వనన్న విషయాన్ని వెల్లడించింది.

తాజా ఉదంతంలో తన సపోర్ట్ ఏ మాత్రం లేదన్న కాజల్.. తన కోసం పని చేసే వారి పట్ల తాను ఎంతో అభిమానంతో ఉంటానని చెప్పింది. తన కోసం పని చేసే వారి వ్యక్తిగత జీవితాల్ని తాను నియంత్రించలేనని.. తన కెరీర్ గురించి తన పేరెంట్స్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పింది.

నటన పరంగా అందరితో స్నేహంగా ఉంటానని.. వారికి సంబంధించిన అలవాట్ల గురించి తనకు తెలీదంది. సినిమాలకు సంబంధించి రకరకాల వ్యక్తులతో పని చేయాల్సి ఉంటుందని.. వారితో తాను స్నేహపూర్వకంగా ఉంటానని చెప్పింది. సినిమా పూర్తి అయిన తర్వాత తాను ఎక్కువగా కలవనని చెప్పింది. తన సుదీర్ఘ వివరణతో రోనీ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించటంతో పాటు.. తనకు పాపపు పనులతో సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం కనిపిస్తుంది.

,  ,  ,  ,  ,