Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 15:19:16
facebook Twitter Googleplus
Photo

బ్రహ్మోత్సవం. అనుకున్నంత ఆకట్టుకోకపోయినా.. కొన్ని సీన్లు మాత్రం హృదయాలను టచ్ చేస్తాయి. ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఎదుర్కొనే కొన్ని ప్రాబ్లమ్సే శ్రీకాంత్ అడ్డాల చాలా సింపుల్ గా చూపించేశాడు. అయితే ఈ మొత్తం సినిమాలో బాగా డిజప్పాయింట్ చేసింది ఎవరైనా ఉన్నారా అంటే.. చాలామంది యూత్.. హీరోయిన్ల పేరే చెప్పడం గమనార్హం.

ఈ సినిమాలో కాజల్ ను చూస్తే.. చాలా సన్నబడిన సువ్వలా ఉంది. ఫస్టు ఆమె లుక్కే పెద్ద షాక్ అయితే.. ఇక ఆమె వేసిన క్యారెక్టర్ లో కూడా అంత దమ్ము లేదు. పైగా కాజల్ యాక్టింగ్ కూడా అంతంతమాత్రమే. మరి డైరక్టర్ ఎక్స్ ట్రాక్ట్ చేసుకోలేదో లేకపోతే ఈమె అంతకంటే చెయ్యలేకపోయిందో తెలియదు కాని.. ఎన్నారై అమ్మాయిలా బిలీవబులిటీ మాత్రం లేదు.. కాజల్ యాక్టింగ్ లో. ఆమె పెర్ఫామెన్స్ చాలా పూర్ గా ఉండటంతో.. ఫ్యాన్సుకు షాక్కొట్టినట్లయింది.

ఇకపోతే సమంత విషయానికొస్తే.. అమ్మడు రొటీన్ గా ఫటాకా స్టయిల్ యాక్టింగ్ చేసింది. కాకపోతే క్యారెక్టర్ కు కావల్సినంత బేస్మెంట్ అండ్ ఫౌండేషన్ స్ర్కిప్టులోనే లేదు కాబట్టి.. సమంత కూడా ఏం చేయలేకపోయింది. దానికితోడు అమ్మడు ఫేస్ కాస్త ఉబ్బిపోయినట్లు కనిపించడంతో.. క్యూట్ నెస్ మిస్సయిపోయింది. అందువలనే క్యారెక్టర్ బోర్ గా అనిపించింది. అది సంగతి.

,  ,  ,  ,  ,