Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2015 11:33:36
facebook Twitter Googleplus
Photo

నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాల్లో బిజీ కథానాయికగా రాణించిన కాజల్ అగర్వాల్ ఇటీవల హఠాత్తుగా తెలుగుతెర నుంచి అదృశ్యమైంది. ఓపక్క తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్న ఈ సుందరి తెలుగులో ఎందుకు చేయడం లేదు? అన్న అంశంపై ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అమ్మడికి తెలుగులో ఆఫర్లు లేకపోవడం అన్నది లేదనీ, పారితోషికం వద్దే అవి ఆగిపోతున్నాయని అంటున్నారు. తన దగ్గరకి వస్తున్న తెలుగు నిర్మాతలకు ఈ చిన్నది రెండు కోట్ల ఫిక్సెడ్ రేటు చెబుతోందని, తాను చెప్పిన ఆ మొత్తం ఇస్తే హీరో ఎవరు? కథ ఏమిటి? అన్న విషయాల్లో తనకు పట్టింపు లేదని చెబుతోందట. దీంతో నిర్మాతలు ఆమెకో నమస్కారం పెట్టి వెనక్కు వచ్చేస్తున్నారట. తమిళ, హిందీ భాషల్లో 50-60 లక్షల మధ్యలో తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగుకే అంత పెద్ద మొత్తంలో ఎందుకు అడుగుతోందో అర్థం కావడం లేదని అంటున్నారు!

,  ,  ,