Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 11:00:07
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 షూటింగ్.. దాదాపు పూర్తయిపోయిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ లోనే సెట్స్ వేసి మరొక పాటను షూట్ చేస్తే.. ఇక గుమ్మడికాయ కొట్టేయనున్నారని తెలుస్తోంది. సంక్రాతి రిలీజ్ కి షెడ్యూల్ చేసిన ఈ మూవీ కోసం.. నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. రామ్ చరణ్ మూవీ ధృవ రిలీజ్ నుంచి గ్యాప్ ఇవ్వకుండా పబ్లిసిటీ యాక్టివిటీస్ చేపడతారట. అయితే.. మెగాటీంని కాజల్ అగర్వాల్ ఫ్యాక్టర్ భయపెడుతోందని చెప్పుకుంటున్నారు.

గతేడాది వరగూ చందమామ అందరికీ గోల్డెన్ లెగ్గే. కానీ ఈ ఏడాది సిట్యుయేషన్ మారిపోయింది. కాజల్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం మూవీస్ ఆల్ టైం డిజాస్టర్లలో చేరిపోయాయి. హిందీలో దో లఫ్జోం కా కహానీ చేస్తే.. అది కూడా పేలిపోయింది. రీసెంట్ గా కోలీవుడ్ మూవీ కావలై వేందాం పరిస్థితి కూడా సేమ్ డిట్టో. జనతా గ్యారేజ్ లో చేసిన ఐటెం సాంగ్ తప్ప.. ఈ ఏడాది కాజల్ కు చెప్పుకునేందుకు ఏం లేదు. ఐరన్ లెగ్ అనే స్టాంప్ కూడా పడిపోయింది.

సరిగ్గా ఈ పాయింటే చిరు అండ్ టీంను కలవరపెడుతోందట. అయితే ఖైదీ నెంబర్ 150 మూవీ సూపర్బ్ గా రావడం.. ప్రతీ ఫ్రేమ్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండడం.. మెగా క్యాంప్ కు ఊరట కలిగించే విషయం. చిరు మూవీతో తన ఫ్లాప్ ల పరంపరకు చెక్ పడుతుందని కాజల్ బోలెడన్ని ఆశలు పెట్టేసుకుంది. మరి ఎవరి ఫ్యాక్టర్ ఎవరిపై పని చేస్తుందో!

,  ,  ,  ,