Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 11:28:43
facebook Twitter Googleplus
Photo

బాహుబలి? లో భల్లాలదేవగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన రాణా ప్రస్తుతం ఘజి, బాబుబలి ? 2 నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇంకో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తున్నది. గతంలో సంచలన విజయాలు సాధించి ఇటీవల వరుస అపజయాలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించబొతున్నట్లు తెలిసింది. తేజ ఇటీవల రాజశేఖర్ ఓ ప్రధాన పాత్రలో ?అహం? పేరుతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తేజ ఆ ప్రాజెక్టును పక్కనబెట్టి రాణా కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సినిమాలో రాణా సరసన కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటిస్తుండటం విశేషం. అంతేకాకుండా తేజ దర్శకత్వం లో ?లక్ష్మీ కళ్యాణం? సినిమా ద్వారా పరిచయం అయిన కాజల్ అగర్వాల్ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత తేజ దర్శకత్వం లో నటిస్తుండటం మరో విశేషం. ఈ సినిమా గురించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,