Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2014 17:03:00
facebook Twitter Googleplus
Photo

తమిళంలో రాణిస్తున్న తెలుగబ్బాయి విశాల్ పొజిషన్ అంతకంతకు పెరుగుతోంది. ఇటీవలే శృతిహాసన్ తో కలసి 'పూజై' చిత్రంలో నటించిన ఈ కుర్రాడు వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ప్రస్తుతం హన్సికతో కలసి సుందర్ దర్శకత్వంలో 'అంబల' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడీ సినిమా షూటింగ్ దశలో వుంది. వచ్చే సంక్రాంతికి దీనిని రిలీజ్ చేస్తారు. దీని తర్వాత సుశీంద్రన్ దర్శకత్వంలో నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ ను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. కాజల్ తో విశాల్ కిది మొదటి సినిమా అవుతుంది. మొత్తానికి టాప్ హీరోయిన్లందరూ తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నాడు.

,  ,  ,  ,  ,