Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2017 12:18:40
facebook Twitter Googleplus
Photo

ఓ ఏడాదిన్నర క్రితం అనుకుంటా.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పరిస్థితి ఇక అయిపోయినట్లేనని.. ఆమె క్రేజ్ అంతరించిపోయిందని.. కెరీర్ అవసాన దశకు వచ్చేసిందని అంతా అనుకున్నారు. దీనికి తోడు సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం.. దో లఫ్జోం కీ కహానీ అంటూ.. మూడు నెలల తేడాలో మూడు డిజాస్టర్లు కొట్టడంతో.. కాజల్ గురించి మర్చిపోవచ్చని ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడి నుంచే కథ మారిపోయింది. క్రేజీ ప్రాజెక్టులను పట్టేసింది.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో ఒకే ఒక్క ఐటెం సాంగ్ తో మెప్పించిన కాజల్.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్ 150లో మెరిసి.. ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ లో భాగమైంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కొత్త మూవీ స్టార్ట్ చేసింది కాజల్ అగర్వాల్. అట్లీ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ఈ దర్శకుడు ఇప్పటికే విజయ్ తో తెరి లాంటి హిట్ అందించడంతో.. విజయ్61గా రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టులో లీడ్ హీరోయిన్ పాత్ర పట్టేసి ఔరా అనిపించేస్తోంది చందమామ.

మరో తమిళ స్టార్ అజిత్ సరసన వివేగం చిత్రంలో కూడా కాజల్ నటిస్తోంది. ఇక తేజ డైరెక్షన్ లో రానాకి జోడీగా నేనే రాజు నేనే మంత్రి మూవీలో కూడా హీరోయిన్ కాజలే.

,  ,  ,  ,  ,  ,