Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2015 16:15:55
facebook Twitter Googleplus
Photo

గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ప్రముఖ తెలుగు హస్య నటుడు కళ్లు చిదంబరం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 70 ఏళ్ల చిదంబరం కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల్ని నవ్విస్తున్నారు. తాను వచ్చిన పని అయిపోయిందని భావించారేమో కానీ.. పైలోకాల్లో నవ్వులు పూయించటానికి ఆయన వెళ్లిపోయారు.

విశాఖపట్నంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం ఆదివారం నాటికే విషమంగా ఉంది. ఆయనకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. 1945 అక్టోబరు 10న జన్మించిన కళ్లు చిదంబరం.. కళ్లు సినిమాతో పరిచయం అయిన ఆయన.. అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం. సినిమాల్లోకి రాకముందు రంగస్థలం మీద పలు పాత్రలు వేసి అలరించారు. దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయన.. తనదైన శైలిలో ప్రేక్షకుల్ని నవ్వించారు.

,  ,