Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Sep-2017 14:42:17
facebook Twitter Googleplus
Photo

ఫోటో చాలానే అర్ధాలు చెబుతుంది. ఈ విషయం చాలామందికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కానీ ఇదే సంగతి సెలబ్రిటీలు చెబితే ఆ కథే వేరుగా ఉంటుంది. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక చక్కనైన ఫోటోను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు ఈ హీరో. తండ్రి నందమూరి హరికృష్ణ.. కళ్యాణ్ రామ్ లు ఈ ఫోటోలో ఉండగా.. కొడుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న తండ్రి ఈ ఫోటోలో కనిపిస్తాడు.

అయితే.. హైట్ డిఫరెన్స్ కారణంగా.. తండ్రినే కొడుకు దగ్గరకు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఎవరు ఎవరిని దగ్గరకు తీసుకున్నారనే సంగతి పక్కన పెడితే తండ్రీకొడుకుల ఆప్యాయత మాత్రం కనిపిస్తుంది. ఈ ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేసిన కళ్యాణ్ రామ్.. ఒక్క ఫోటో ఎన్నెన్నో అర్ధాలకు ప్రతిరూపం అని చెప్పాడు. తండ్రి పుట్టిన రోజున.. కేక్ కోక్ కోసిన తర్వాత అమూల్యమైన క్షణాన్ని అద్భుతమైన ఫోటోగా అభిమానులకు అందించాడు ఈ నందమూరి హీరో. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఇటు నిర్మాతగాను.. అటు హీరోగాను వెలిగిపోతున్న సంగతి తెలిసిందే.

సోదరుడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవ కుశ చిత్రాన్ని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా.. తను హీరోగా ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తున్నాడు.

,  ,  ,  ,