Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2016 12:40:37
facebook Twitter Googleplus
Photo

2009లో ?ప్రస్థానం?తో చిన్నా పాత్రతో నటుడిగా పరిచయమైన సందీప్‌ కిషన్ ?స్నేహగీతం? తో కథానాయకుడయ్యాడు. ?వెంకటాద్రి ఎక్స్ ప్రెస్? సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆయన ఇప్పటివరకూ 17 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు రాజసింహ దర్శకత్వంలో ?ఒక్క అమ్మాయి తప్ప? చిత్రంలో నటిస్తున్నాడు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తరువాత తన ఆరో రోజు పుట్టిన రోజు (మే 7) జరుపుకుంటున్న సందీప్ కిషన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు :
ప్రశ్న) ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ పుట్టిన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు?
స) ప్రత్యేకత ఏమీలేదు. ఎప్పటిలా కుటుంబ సభ్యులతో కలసి పుట్టినరోజు జరుపుకుంటున్నాను. అలాగే ప్రతి పుట్టిన రోజుకి ఓ సినిమా చూడడం నాకు అలవాటు. అలాగే ఈ రోజు ఒక సినిమా చూస్తా. ఈరోజుకి ప్రత్యేకత అంటూ ఏంలేదు?
ప్రశ్న) మీరు నటిస్తున్న ?ఒక్క అమ్మాయి తప్ప? సినిమా గురించి చెప్పండి?
స) ?ఒక్క అమ్మాయి తప్ప? కథ 2012 డిసెంబర్ లో విన్నాను. హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ మీద ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌ ఒక యువకుడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఎక్కువ గ్రాఫిక్‌ వర్క్స్‌ ఉంటుంది. నా చిత్రాల్లోకెల్లా భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతోంది.
ప్రశ్న) సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో కాలేజ్ డ్రాపవుట్ గా కనిపిస్తాను. చాలా తెలివైన వాడు. చదువంటే ఇష్టం లేక మధ్యలో వదిలేస్తాడు. పుస్తకాలు చదవడం కంటే వ్యక్తులను చదవడానికి ఇష్టపడేవాడు.
ప్రశ్న) నిత్య మీకన్నా చాలా పొట్టిగా కదా.. అది మీకు ఇబ్బందిగా అనిపించలేదా?
స) రాజసింహా చెప్పిన కథ నిత్య కు నచ్చడంతోనే నటించడానికి అంగీకరించింది. ఈ సినిమాలో ఉన్న ఎమోషన్ ప్రకారం చిన్న చిన్న హావభావాలు ప్రకటించవల్సి ఉంటుంది. అందుకనే ఆమెను సంప్రదించాం. అనుకున్నట్లే నిత్యా బాగా నటించింది. ఇక నిత్యా ఎత్తు గురించి నాకు ఎటువంటి సమస్యలూ లేవు.
ప్రశ్న) ఈ సినిమా దర్శకుడు రాజసింహ గురించి చెప్పండి?
స) ఇప్పటివరకూ నేను పనిచేసిన దర్శకుల్లో బెస్ట్ కమర్షియల్ డైరక్టర్. అలాగే నేను ఇంతవరకూ పనిచేసిన రచయితల్లో రాజసింహా చాలా ప్రతిభ ఉన్నవాడు. కామెడీ పండించడం తన బలం.
ప్రశ్న) ఏ స్థాయి విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు?
స) నిజానికి నేను సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడే ప్లాప్ సినిమానే నా కెరీర్ లో ఉండకూడదనుకున్నాను. కానీ మనం అనుకున్నవన్నీ జరుగవు కదా. ఇప్పటివరకూ మంచి సినిమాలు చేశాను. చెడ్డ సినిమాలు చేశాను. ప్రతి సినిమా ప్రేక్షకుల ఆకట్టుకుంటుందనే ప్రారంభిస్తాం. ఓ స్థాయి ప్రేక్షకులకు నచ్చకుంటే వాళ్లకు నచ్చేలా సినిమా తీయలేదని భావిస్తా కానీ జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను.
ప్రశ్న) సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోతే ఏమనిపిస్తుంది?
స) నేను కెరీర్‌ ప్రారంభించిన మొదట్లో భయంతో నావద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించాను. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే ఒకప్పుడు అవకాశం వస్తుందో రాదోనన్న భయం ఉండేది. ఇప్పుడు అది లేదు. నా మనసుకు నచ్చిన కథ లభించకుంటే ఖాళీగా ఉంటా తప్ప ఏ సినిమా అంటే ఆ సినిమా చేయను.
ప్రశ్న) మళ్లీ నెగటివ్ పాత్ర అవకాశం వస్తే చేస్తారా..?
స) నా మొదటి చిత్రం ?ప్రస్థానం?లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించాను. మళ్ళీ మంచి కథ, మంచి పాత్ర లభిస్తే.. అలాంటి పాత్రల్లో నటించడానికి సిద్ధమే.
ప్రశ్న) కృష్ణవంశీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి?
స) నేను పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఆయనతో సినిమా చేయాలని ఉండేది. కానీ ఇప్పుడు ఆయనే పిలిచి ఈ కథ నీకు సూటవుతుందని చెప్పడం చాలా ఆనందం కలిగించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలనే నా కల ?నక్షత్రం?తో తీరుతోంది. ఆయన గొప్ప టెక్నీషియన్. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

,  ,  ,  ,