Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Aug-2015 16:09:45
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడో సమ్మర్ ఆరంభంలో రావాల్సిన కిక్-2 మూవీ ఎందుకింత ఆలస్యమైందో ఎవరికీ అర్థం కాలేదు. నిర్మాత కళ్యాణ్ రామ్ దర్శకుడు సురేందర్ రెడ్డిల మధ్య ఏవో విభేదాలు వచ్చాయని.. సురేందర్ సినిమాకు అతిగా ఖర్చు పెట్టించేయడంపై కళ్యాణ్ రామ్ అసంతృప్తి వ్యక్తం చేశాడని.. దీంతో సురేందర్ పోస్ట్ ప్రొడక్షన్ పక్కనబెట్టేసి వెళ్లిపోయాడని రకరకాలుగా ప్రచారం జరిగింది. ఈ ఊహానానాలు వచ్చినపుడు కళ్యాణ్ రామ్ కానీ సురేందర్ కానీ పెదవి విప్పకుండా సైలెంటుగా ఉన్నారు. ఐతే ఇప్పుడు కిక్-2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 21న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా వచ్చింది. కళ్యాణ్ రామ్ సురేందర్ సంయుక్తంగా ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం విశేషం.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ??మా కిక్-2 సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. ఆగస్టు 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 14న ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగుతుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. నిర్మాతగా వంద శాతం శాటిస్ఫై అయ్యాను. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో అందరినీ ఆకట్టుకునేలా సురేందర్ ఈ సినిమాను రూపొందించాడు. మా బేనర్లో ఈ సినిమా సూపర్ హిట్టవుతుంది?? అన్నాడు. సురేందర్ మాట్లాడుతూ.. ??ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో అతనొక్కడే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన నేను మళ్లీ ఈ బేనర్లో సినిమా చేయడం.. రవితేజతో కిక్ తర్వాత మళ్లీ కిక్-2 చేయడం చాలా హ్యాపీగా ఉంది. అతనొక్కడే కిక్ లాగానే కిక్-2 కూడా సూపర్ హిట్టవుతుందన్న నమ్మకం నాకుంది?? అని చెప్పాడు. మొత్తానికి రిలీజ్ కు ముందు కళ్యాణ్ రామ్ సురేందర్ ఇలా ఉమ్మడిగా ప్రెస్ నోట్ ఇచ్చి తమ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించేశారు.

,  ,  ,  ,