Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 10:47:09
facebook Twitter Googleplus
Photo

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజం రిలీజ్ కి మరి కొన్ని రోజులే గ్యాప్ ఉంది. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ మూవీపై.. నందమూరి అభిమానుల్లో మంచి బజ్ నెలకొంది. ఇప్పటికే ఇజం హిట్ ఖాయం అంటూ చాలానే సెంటిమెంట్స్ ఉండగా.. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ లింక్ ని కూడా నందమూరి అభిమానులు బయటకు తీశారు.

1955 అక్టోబర్ 21న విడుదలైన జయసింహతో బ్లాక్ బస్టర్ కొట్టారు సీనియర్ ఎన్టీఆర్. హోమ్ బ్యానర్ లో ఆయనకు ఇదే తొలి బ్లాక్ బస్టర్. ఆ తర్వాత 1970 అక్టోబర్ 21న రిలీజ్ అయిన కోడలు దిద్దిన కాపురం కూడా నందమూరి వారి హోమ్ హోమ్ బ్యానర్ లోనే రిలీజ్ కాగా.. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక 1977 అక్టోబర్ 21న విడుదలైన యమగోల అయితే.. చాలానే సెన్సేషన్స్ సృష్టించేసింది.

ఇప్పుడు 2016 అక్టోబర్ 21న విడుదలవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఇజం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ బోలెడన్ని హోప్స్ పెట్టేసుకున్నారు. ట్రైలర్.. సినిమాపై ఉన్న బజ్.. పూరీలో ఉన్న కసి చూస్తుంటే.. ఇజంపై సెంటిమెంట్స్ నిజం అయిపోతాయనే అనిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,