Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 11:39:15
facebook Twitter Googleplus
Photo

నేను రోజు ఇంట్లో పొద్దున్నే స్నానం చేయడానికి మాత్రమే బ్రెయిన్ వాడే వాడిని. కారులోకి ఎక్కగానే బ్రెయిన్ స్విచ్చాఫ్ చేశాను. షూటింగ్ లొకేషన్ కు వెళ్ళి పూరి సార్ చెప్పింది చేశాను. అదే ఇజం'' అంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న దృష్ట్యా.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాడనే చెప్పాలి.

అసలు ఈ సినిమాకు మనోడు సిక్స్ ప్యాక్ ఎందుకు పెంచాడంటే.. దానికి రెండు రీజన్లను చెప్పాడు. ''పూరి సార్ కథ విన్నాక ఆల్రెడీ మోటివేషన్ వచ్చేసింది. నేను ఆయన్ను ఇంప్రెస్ చేయాలి. డిజప్పాయింట్ చేయకూడదు. అందుకే నేను సిక్స్ ప్యాక్ చేశాను''. మరి రీజన్ నెం 2 ఏంటి? ''పూరి గారు పనిచేసిన హీరోల్లో టాప్ 3 హీరోల్లో నేను ఉండాలి. అలా ఉండడానికే ప్రయత్నించా. అందుకే ఈ సినిమా కోసం కష్టపడ్డా. మరి నేను ఎక్కడ ఉన్నానో పూరి సారే చెప్పాలి'' అన్నాడు. మరి పూరి జగన్ ఒపినియన్ ఏంటి? ''నా టాప్ 3లో ఉన్నాడు. అక్టోబర్ 21న మీకు అర్దమవుతుంది'' అంటూ పూరి కూడా కాంప్లిమెంట్ ఇచ్చాడులే.

ఇకపోతే కంక్లూడింగ్ స్టేట్మెంట్ గా.. ''బిఫోర్ ఇజం కళ్యాణ్ రామ్.. ఆఫ్టర్ ఇజం కళ్యాణ్ రామ్.. ఇది టాలీవుడ్లో నా రెండో వర్షన్ అవుతుంది. మీరు రాస్కోండి. నా 2.0 వస్తోంది'' అంటూ కళ్యాణ్ రామ్ చాలా ధీమగా చెప్పడం చూస్తుంటే.. ''ఇజం'' బ్లాక్ బస్టర్ అవుతుందనే అనుకోవాలి.

,  ,  ,  ,  ,