Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jun-2015 17:00:22
facebook Twitter Googleplus
Photo

నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పాటల చిత్రీకరణ మినహా ఈ సినిమా షూటింగు దాదాపుగా పూర్తయింది. 'అలా మొదలైంది' వంటి ఫీల్ కలిగిన టైటిల్ పెట్టి హిట్ కొట్టిన నందినీరెడ్డి, ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడుతుందోననే ఆసక్తితో యూత్ ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'కల్యాణ వైభోగమే' అనే టైటిల్ ని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. టైటిల్ శుభప్రదంగా అనిపించడమే కాదు, యూత్ ఆశించే ఫీల్ కూడా ఈ టైటిల్లో కనిపిస్తోంది. అందమైన ఈ ప్రేమకథ పాటలను కూడా తోడుచేసుకుని సాధ్యమైనంత తొందరగా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

,  ,