Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2016 15:54:08
facebook Twitter Googleplus
Photo

రాశి ఖన్నా.. తెలుగులో ప్రస్తుతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోన్న హీరోయిన్. తాజాగా సాయిధరమ్ తేజ్ సరసన ఆమె హీరోయిన్‌గా నటించిన ?సుప్రీమ్? సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ గురువారం (మే 5న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రాశిఖన్నాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ?సుప్రీమ్? సినిమాలో మీ పాత్ర గురించి ఏకంగా ఓ పాటే ఉన్నట్లుంది. బెల్లం శ్రీదేవి పాత్ర ఎలా ఉండబోతోంది?
స) ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నింటిలోకెల్లా ?సుప్రీమ్? సినిమాలోని బెల్లం శ్రీదేవి పాత్ర చాలా స్పెషల్. మొదటిసారి ఈ సినిమాలో ఓ పోలీసాఫీసర్‌గా కనిపిస్తున్నా. ఆ పాత్రకు ఉండే కామెడీ టచ్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడం చాలెంజింగ్ అనే చెప్పాలి. ఆ చాలెంజ్‌నే ధైర్యంగా చేశా.
ప్రశ్న) ఇందులో మీకు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అవి ఎలా ఉండబోతున్నాయి?
స) ఈ సినిమాలో నా ఎంట్రీయే ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ఉంటుంది. కామెడీ, యాక్షన్.. ఇలా హీరోలు మాత్రమే చేసే అంశాలను ఈ సినిమాలో చేసే అవకాశం నాకు దక్కింది. అదో గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా. ఈ సినిమా తర్వాత నన్ను ఓ గ్లామరస్ హీరోయిన్‌గా మాత్రమే కాక నటిగానూ గుర్తిస్తారన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) ఇంతకీ సుప్రీమ్ కథేంటీ? సినిమా ఎలా ఉండబోతోందీ?
స) సినిమా కథేంటీ అన్నది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉండబోతోందీ? అని అడిగితే మాత్రం పూర్తిగా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చెప్పగలను. మొదట్నుంచీ చివరివరకూ అన్నిరకాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా సుప్రీమ్ సినిమా ఉంటుంది.
ప్రశ్న) హీరో సాయిధరమ్ తేజ్ గురించి చెప్పండి?
స) సాయిధరమ్ తేజ్ చాలా మంచి యాక్టర్. ఎలాంటి సన్నివేశమైనా ఇట్టే లీనమైపోయి నటించేస్తాడు. అతడితో కలిసి ఈ సినిమాలో నటించడం మంచి అనుభూతి. నటన పరంగా, భాష పరంగా చాలా విషయాల్లో సహకరిస్తూ ఉండేవాడు.
ప్రశ్న) ఈ సినిమా కోసం బరువు తగ్గినట్లున్నారు?
స) ఈ సినిమా కోసమే అని కాదు కానీ, లుక్ పరంగా మార్పు కోరుకొనే అలా చేశా. ఈ సినిమాలో చూపించిన చేంజ్ ఓవర్‌తో రాశి కొత్తగా కనిపిస్తోంది అని అందరూ అంటున్నారు. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా.
ప్రశ్న) తెలుగు హీరోయిన్లంతా ఇప్పుడు స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమైపోతున్నారు. మీరెప్పుడు డబ్బింగ్ చెబుతున్నారు?
స) ఇప్పుడు నేను హైద్రాబాద్ అమ్మాయిగా మారిపోయా. తెలుగు కూడా పూర్తిగా వచ్చేసింది. అయితే నా డిక్షన్‌లో ఇంకా నార్త్ ఇండియా టచ్ పోలేదు. దీంతో డబ్బింగ్ గురించి ఆలోచిస్తున్నా. నెక్స్ట్ సినిమాకు తప్పకుండా స్వయంగా డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తా.
ప్రశ్న) తదుపరి సినిమాలేంటి?
స) ప్రస్తుతం గోపీచంద్‌ ఆక్సీజన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నా. రవితేజ కొత్త సినిమాలోనూ హీరోయిన్‌గా నటించనున్నా. ఆ సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వెళుతుంది.

,  ,  ,  ,