Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 12:10:57
facebook Twitter Googleplus
Photo

ఒకేసారి రెండు సినిమాలను విడుదలకు రెడీ చేసే సిట్యుయేషన్ హీరోలకు అరుదుగా వస్తుంది. యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసేశాడు. సరైన డేట్ దొరక్క ఇంకా ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం ఫైనల్ కాలేదు. అయితే.. ఇప్పుడు చైతు నటిస్తున్న మరో రొమాంటిక్ లేటెస్ట్ మూవీ ప్రేమమ్ కూడా తుది దశకు చేరుకుందని తెలుస్తోంది.

ప్రేమమ్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిపోయినట్లు సమాచారం. ఇంకా కొన్ని పాటలను పిక్చరైజ్ చేస్తే.. షూటింగ్ మొత్తం అయిపోనుందని చెబుతున్నారు. వీటిలో రెండు పాటల కోసం యూరోప్ లోని నార్వేలో మనోహరమైన లొకేషన్లలో తీయనున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను అన్వేషించే టాలీవుడ్ జనాలు.. ఇప్పటికే ఈ దేశంలోని పలు అందమైన ప్రాంతాలను పిక్చరైజ్ చేశాయి కూడా.

ప్రేమమ్ యూనిట్ జూలైలో యూరోప్ బయల్దేరనుంది. అయితే.. ఈ రెండు పాటల్లో చైతుతో ఆడిపాడే హీరోయిన్స్ ఎవరో మాత్రం యూనిట్ వర్గాలు చెప్పడం లేదు. శృతి హాసన్ - అనుపమా పరమేశ్వరన్ - మడొన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఈ ముగ్గురిలో యూరోప్ లో చైతుతో చిందులేసే చిన్నది ఎవరో తెలియలేదు.

,  ,  ,  ,  ,