Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2017 10:16:50
facebook Twitter Googleplus
Photo

నిన్నటి తరం సూపర్ స్టార్స్ అందరు ఇప్పుడు వెండితెర నుండి బుల్లి తెర వైపు చూస్తున్నారు. టీవీ పోగ్రాం తో జనాలుకు దగ్గరకావచ్చు మరియు ఒక పరిపాటి సొమ్ము మూటగట్టు కోవచ్చు అని తెలుస్తుంది కాబోలు వీళ్ళకి. ఆధ్యుడు బిగ్ బి అమితాబ్ తో మొదలుపెట్టి తరువాత షారుఖ్ - ఆమీర్.. తెలుగులో అయితే నాగార్జున.. చివరకు చిరంజీవి కూడా టివి బాటలోనే పయనించారు.

ఇప్పుడు తమిళనాడు లో మహా నటుడు ‘కమల్ హసన్’ టీవీ లో ఒక షో ని హోస్ట్ చేబోతున్నారు అని తెలుస్తుంది. హిందీ లో ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ ఇప్పుడు ఒక తమిళ్ టీవీ లో ఆయన హోస్ట్ చేస్తారు అంటా. ఈ విషయం గురించి సంభందించిన నిర్వాహకులు తో మంతనాలు జరిగాయని.. అవి చాలా ఆశాజనకంగా ఉన్నాయీ అని చెప్పుతున్నారు తమిళ మీడియవారు. కమల్ హసన్ కొత్త చిత్రం శభాష్ నాయుడు లేటవుతున్న సంగతి తెలుసు కదా.. మరి మన విశ్వ నాయకుడు ఏమి చేస్తాడో చూడాలి.

ఇప్పుడు సడన్ గా ఆయన టివిలోకి వచ్చేస్తే.. ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని టీవీ వర్గాలు ఉత్కంటగా ఎదురు చూస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,