Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2017 13:31:21
facebook Twitter Googleplus
Photo

ఇంతవరకు సౌత్ లో సీక్వెళ్లపై దర్శక - నిర్మాతలకు అస్సలు నమ్మకం ఉండేది కాదు. అసలా ఆలోచన కూడా చేసేవాళ్లు కాదు. ఇప్పుడు సక్సెస్ సాధించిన సినిమాలకు సీక్వెల్ తీయాలన్న ఆలోచన పెరుగుతోంది. శంకర్ లాంటి భారీ చిత్రాల డైరెక్టర్ కూడా వరసగా 2.0 - భారతీయుడు-2 సీక్వెళ్లే తీస్తున్నాడంటే ఈ సినిమాలపై పెరిగిన ఆసక్తి అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఈ జాబితాలో తెలుగు-తమిళ చిత్రాల హీరో విశాల్ కూడా చేరుతున్నాడు.

విశాల్ హీరోగా నటించి నిర్మించిన లేటెస్ట్ మూవీ డిటెక్టివ్ మంచి టాక్ నే తెచ్చుకుంది. మిస్కిన్ డైరెక్టర్. సీరియస్ ఇన్వెస్టిగేషన్ మెయిన్ కాన్సెప్ట్ గా వచ్చే సినిమాలు తక్కువగా ఉండటం.. సినిమా స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ గా ఉండటంతో కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని అంటున్నాడు. ఇప్పటికే విశాల్ తనకు బాగా పేరు తెచ్చిన రెండో చిత్రం పందెంకోడికి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. డిటెక్టివ్ సినిమాలే పాటలే లేవు. ఇదేమిటని విశాల్ ను అడిగితే.. ముందుముందు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని.. సినిమాల్లో పాటల అవసరం తగ్గిపోతుందని జోస్యం చెబుతున్నాడు.

విశాల్ సినిమాల్లో అత్యధికం సొంత ప్రొడక్షన్ లోనే వస్తుంటాయి. బయట ప్రొడక్షన్ హౌస్ లతో ఎందుకు చేయడం లేదని అడిగితే వేరే నిర్మాతలతో పనిచేసినప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. అందుకే సొంత సినిమాలే చేసుకుంటున్నాని అంటున్నాడు.

,  ,  ,  ,  ,