Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2015 13:46:57
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ .. నయనతార .. షీలా నాయకా నాయికలుగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'అదుర్స్' చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా, ఆ ఏడాదిన చెప్పుదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి మోడ్రన్ గెటప్ అయితే మరొకటి పూజారి గెటప్. ఇప్పుడీ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు మొదలయ్యాయి. పంచె కట్టుకుని .. నామాలు పెట్టుకుని .. గురువుగారూ .. గురువుగారు అంటూ ఈ సినిమాలో పూజారిగా ఎన్టీఆర్ పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇక ఆ గురువుగారిగా బ్రహ్మానందం చేసిన సందడి అంతా ఇంతాకాదు.

సెంటిమెంట్ .. కామెడీ .. యాక్షన్ .. సమపాళ్లలో మిక్స్ చేసిన ఈ సినిమా సీక్వెల్ చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కోనవెంకట్ .. గోపీ మోహన్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ సినిమా చేస్తోన్న వినాయక్ అది పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్ మీదకి వస్తాడని అంటున్నారు. అలాగే సుకుమార్ కాంబినేషన్లో చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా తరువాత 'అదుర్స్ 2' చేస్తాడని చెబుతున్నారు. ఇక గత సినిమాలో మాదిరిగానే ఈ సినిమాకి నయనతారను ఎంపిక చేశారు. షీలాకి బదులుగా 'ఆండ్రియా' ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ .. వినాయక్ కలిసి మరోమారు నవ్వుల నజరానాను అభిమానులకి అందించనున్నారన్న మాట.

,  ,  ,  ,