Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2015 12:05:58
facebook Twitter Googleplus
Photo

అమీర్ ఖాన్ కి కూతురుగా నటించే ఛాన్స్ కథానాయిక కంగనా రనౌత్ కి వచ్చింది. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగెట్ జీవితం ఆధారంగా హిందీలో 'దంగల్' పేరిట ప్రస్తుతం ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ కోసం అమీర్ ఖాన్ ని సంప్రదిస్తున్నారు. ఆ పాత్ర పోషించడానికి ఆయన ఓకే చెప్పాడట. ఇక మహావీర్ సింగ్ కూతురైన గీతా ఫోగెట్ తండ్రికి తగ్గ తనయగా రెజ్లింగ్ లో పేరు తెచ్చుకుంటోంది. అంతేకాదు, భారతీయ తొలిమహిళా రెజ్లర్ గా ఆమెకు పేరుంది. ఈ పాత్ర కంగనాకు ఆఫర్ చేశారు. దాంతో ఆమె ఎగిరిగంతేసి ఒప్పుకుంది. పైగా తన అభిమాన నటుడు అమీర్ కి కూతురుగా నటించడాన్ని మరింత హ్యాపీ ఫీలవుతోందట.

,  ,  ,  ,