Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 11:02:30
facebook Twitter Googleplus
Photo

ఓ సినిమా భారీ కలెక్షన్స్ సాధించడం కొత్తేమీ కాదు. బ్లాక్ బస్టర్స్ అయిన అనేక సినిమాలు.. అప్పటివరకూ ఉన్న రికార్డులను బద్దలు కొట్టడం ఇప్పటివరకూ జరిగిన విషయమే. కానీ ఇవన్నీ లాంగ్ రన్ లో.. అంటే టెస్ట్ మ్యాచ్ టైపులో ఆయా రికార్డులను దాటుకుంటూ ముందుకెళ్లాయి.

కానీ బాహుబలి2 విషయంలో మాత్రం హిందీ వెర్షన్ నిర్మాత కరణ్ జోహార్.. కలెక్షన్స్ ను ఓ టీ20 స్కోర్ లా మార్చేశాడు. ఎప్పటికప్పుడు ఫుల్ స్కోర్ ను ఓ పోస్టర్ వేసి మరీ ప్రకటిస్తున్నాడు. ఉదయానికే కలెక్షన్ ఫిగర్స్ వచ్చేసినా.. సాయంత్రం వరకూ ఆగి అన్ని వెర్షన్స్ నుంచి డేటాను కలెక్ట్ చేసుకుని.. అప్పుడు ఫైనల్ ఫిగర్ ను అనౌన్స్ చేస్తున్నాడు. నాలుగు రోజులు గడిచే సరికి బాహుబలి2 మూవీ.. నాలుగు వెర్షన్స్ కు కలిపి నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 383 కోట్లు. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహార్ చెప్పాడు.

మూడో రోజులు ముగిసేసరికి రూ. 303 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అంటే నాలుగోరోజున బాహుబలి2 నెట్ వసూళ్లు 80కోట్లు అన్నమాట. గ్రాస్ అయితే ఓ 120వరకూ ఉంటుంది. ఇంత వేగంగా బాహుబలి స్కోర్ పెరిగిపోవడాన్నే ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇతర భాషల కంటే హిందీలోనే ఎక్కువగా ఫేర్ చేస్తోంది బాహుబలి.

,  ,  ,  ,  ,  ,