Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2017 15:14:53
facebook Twitter Googleplus
Photo

సినిమా రిలీజైన వెంటనే రివ్యూలు ఇవ్వడం వల్ల నిర్మాతలు నష్టాల పాలవుతున్నారని.. కాబట్టి ఫస్ట్ వీకెండ్ వరకు ఓపిక పట్టి సోమవారం నుంచి రివ్యూలు రాయాలని.. పబ్లిష్ చేయాలని ఈ మధ్యే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. విశాల్ కోరిన సంగతి తెలిసిందే. కొందరు ఈ సూచనను స్వాగతించారు. ఇంకొందరు వ్యతిరేకించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు.. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం విశేషం. ఇది ఆచరణ సాధ్యమైన సూచన కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రివ్యూల వల్ల చెడు మాత్రమే జరగదని.. చాలా మంచి కూడా జరుగుతుందని ఆయన అన్నారు.

పెళ్లిచూపులు.. ఘాజీ లాంటి సినిమాలు పెద్ద విజయం సాధించాయన్నా.. వాటి గురించి జనాలకు తెలిసి అవి ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యాయన్నా రివ్యూల వల్లే అని సురేష్ బాబు అన్నారు. ఓ చెడ్డ సినిమాకు మంచి రివ్యూ ఇచ్చినా అది ఆడదని.. అలాగే ఓ మంచి సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చినా దాని ప్రభావాన్నేమీ తగ్గించలేరని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. ఒక వేళ వెబ్ సైట్లు.. ఎలక్ట్రానిక్ మీడియా.. పత్రికల్లో రివ్యూల్ని ఆపగలిగినప్పటికీ.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇచ్చే సొంత రివ్యూల్ని.. వాళ్ల అభిప్రాయాల్ని ఎవ్వరూ ఆపలేరని.. కాబట్టి రివ్యూలను కొన్ని రోజులు ఆపడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మారిన ట్రెండు ప్రకారం వెళ్లిపోవాల్సిందే అని ఆయన అన్నారు.

,  ,  ,  ,  ,