Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2017 14:45:53
facebook Twitter Googleplus
Photo

నాని కొత్త సినిమా రిలీజైనపుడల్లా అతడి మీద ప్రశంసల జల్లు కురుస్తుంది. తన నటనతో ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు నాని. తాజాగా నిన్ను కోరి తో నటుడిగా ఇంకొన్ని మెట్లు ఎక్కేశాడు నాని. అతణ్ని ఇండస్ట్రీ ప్రముఖులు మనస్ఫూర్తిగా అభినందించడం ప్రతిసారీ గమనిస్తూనే ఉన్నాం. ‘నిన్ను కోరి’లో కొన్ని సన్నివేశాల్లో తన నటనతో కన్నీళ్లు పెట్టించేశాడు నాని. ఈ నటనకు ఇప్పుడందరూ సలాం కొడుతున్నారు. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావు సైతం నాని నటనకు ముగ్ధుడైపోయి.. అతణ్ని పొగిడేస్తూ మొన్న ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సైతం నాని మీద ప్రశంసలు కురిపించాడు.

నిన్ను కోరి సినిమా చూశానని.. ఇదొక అద్భుతమైన ఎంటర్టైనర్ అని అన్నాడు కొరటాల శివ. ఈ సినిమాలో ప్రతి మూమెంట్ నూ తాను ఆస్వాదించానని చెప్పాడు. దర్శకుడు శివ నిర్వాణ.. నిర్మాతలు డీవీవీ దానయ్య.. కోన వెంకట్ లతో పాటు ప్రతి ఒక్కరికీ అతను అభినందనలు తెలిపాడు. నాని గొప్పగా నటించాడని.. వినోదమైనా.. భావోద్వేగాలైనా.. నాని అద్భుతంగా పండించాడని అన్నాడు. హీరోయిన్ నివేదా థామస్ కు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు కొరటాల. ఆమె పెర్ఫామెన్స్ చూశాక రచయితలు.. దర్శకులు ప్రత్యేకమైన పాత్రలు రాస్తారన్నాడు. మిర్చి.. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడిగా తిరుగులేని స్థాయిని అందుకున్న కొరటాల నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం నిన్ను కోరి టీంకు మహదానందాన్నిస్తుందనడంలో సందేహం లేదు.

,  ,  ,  ,  ,