Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Aug-2015 15:58:33
facebook Twitter Googleplus
Photo

కథానాయికలు సామాజిక బాధ్యతలో నేను సైతం అంటూ ముందుకు రావడం ప్రశంసించదగ్గది. ఓ మంచి కాజ్ కోసం తమవంతు సాయంగా ప్రచారం చేయడానికి గతంలో ఎందరో నాయికలు ముందుకొచ్చారు. కాజల్ హన్సిక త్రిష ఇలా భామలంతా సమాజిక సేవనంలో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే బాటలో యువతరం కథానాయిక కార్తీక కూడా సామాజిక సేవలో అడుగుపెడుతోంది.

ఈ భామ 'ఆపరేషన్ హెల్మెట్' పేరుతో ఓ ప్రచార కార్యక్రమానికి రెడీ అవుతోంది. రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోవద్దు. హెల్మెట్ ధరించండి అంటూ రోడ్ల కూడళ్లలో పాంప్లెట్స్ పంచి ప్రచారం చేయనుంది. అందుకోసం 36 మంది వలంటీర్లతో కూడిన టీమ్ ని రెడీ చేస్తోంది. అందుకు తండ్రి వ్యాపార సంస్థను కూడా వినియోగించుకుంటోంది. రాధ తనయ ఇలా సామాజిక సేవ లో నేను సైతం అంటూ ముందుకు రావడం బావుంది.

కార్తీక మంచి మనసుకు జోహార్. అయితే అసలు కార్తీక లో ఉన్నట్టుండి ఇలా సేవా బుద్ధి పుట్టడానికి కారణం ఏంటో తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. నా పర్సనల్ స్టాఫ్లో చాలామంది యాక్సిడెంటుల్లో హెల్మెట్ ధరించక పోయారు. నా బంధుమిత్రుల్లోనూ టూవీలర్ పై యాక్సిడెంటుకి గురై చనిపోయిన వారున్నారు. అందుకే ఇక ఎవరికీ ఇలాంటివి జరగకూడదని ముందుకొచ్చానని కార్తీక చెప్పింది.

,  ,  ,