Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Mar-2017 12:18:31
facebook Twitter Googleplus
Photo

ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయడు సెన్సార్ తేదీని ఫిక్స్ చేసుకుంది. సినీ సర్కిల్స్ సమాచారం ప్రకారం మార్చి 15న సెన్సార్ కార్యక్రమం జరగనుందట. అలాగే ఇటలీ షెడ్యూల్ పూర్తవడంతో సినిమా షూట్ మొత్తం ముగియనుంది. అందుకే చిత్ర యూనిట్ ఇంతకు ముందే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి ముగింపు దశకు తీసుకొచ్చింది. సినిమా 24న రిలీజ్ కానుండటంతో ఇప్పటి నుండే ప్రచార కార్యక్రమాల జోరును కూడా పెంచారు టీమ్.
ఆడియోలో ఒక్కో పాటను విడుదల చేస్తూ అభిమానుల్ని హుషారెత్తిస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే ‘జివ్వు జివ్వు’ అనే పాట కూడా రిలీజై సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇక ఆదియి వేడుక ఎలాగూ లేదుకనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని ప్రకటించారు కానీ అది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

,  ,  ,  ,  ,