Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2016 12:54:13
facebook Twitter Googleplus
Photo

భీమవరం టాకీస్‌ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తాజాగా అందిస్తున్న అనువాద చిత్రం "కేడి బిల్లా-కిలాడీ రంగా". "పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేం పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రెజీనా-బిండుమాధవి హీరోయిన్లుగా, విమల్‌-శివకార్తికేయన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు. మే 13న విడుదల కానున్న ఈ చితరం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసారు.
ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ "కేడి బిల్లా.. కిలాడి రంగా" ట్రైలర్ ను విడుదల చేసి.. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని అభిలషించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, భద్రకాళి ఫిల్మ్స్ అధినేత ప్రసాద్, బాలాజీ నాగలింగం, ఎన్.ఎస్.ఆర్ ఫిల్మ్స్ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.సత్యనారాయణ, డైలాగ్ రైటర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. "కేడి బిల్లా-కిలాడీ రంగా" తప్పకుండా ఘన విజయ సాధించాలని వారంతా ఆకాక్షించారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "రెజీనా, బిందుమాధవిల గ్లామర్‌- విమల్‌, శివకార్తికేయన్‌ల పెర్‌ఫార్మెన్స్ - యువన్‌ శంకర్‌రాజా సంగీతం "కేడి బిల్లా-కిలాడి రంగా" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. "పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ "కేడి బిల్లా-కిలాడీ రంగా" చిత్రాన్నిఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. త్వరలో ఆడియో రిలీజ్‌ చేసి, మే 13న సినిమాను విడుదల చేయనున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్‌, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్: డా.శివ. వై. ప్రసాద్- బి.సత్యనారాయణ, సమర్పణ: రాజ్‌ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

,  ,  ,  ,  ,