Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 11:12:07
facebook Twitter Googleplus
Photo

ఒక్కసారి లక్ తగిలితే దాన్ని ఎవరూ ఆపలేరు. కీర్తీ సురేష్ కి ఇప్పుడు ఆ కిస్మత్ బానే ఫేవర్ చేస్తున్నట్టుంది. ఓ వైపు హిట్స్ ఇస్తోన్న జోష్.. మరోవైపు బిగ్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేసే ఆఫర్స్.. ఇంకోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఫ్యాన్ బేస్- కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న ఓ హీరోయిన్ కి ఇంతకన్నా ఏం కావాలి. ఎగ్జాట్ గా ఇప్పుడు ఆ జాయ్ ఫుల్ మూడ్ లోనే ఉంది లోకల్ పాప. ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ సంఖ్య హాఫ్ క్రోర్ క్రాస్ చేయడంతో ఫెస్టివల్ చేసుకొంటుంది.

ఒకప్పుడు సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం యాక్టర్స్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి సోషల్ మీడియాలో వాళ్లని ఫాలో అవుతున్న ఫ్యాన్ బేసే కీ ఫ్యాక్టరైపోయింది. అందుకే ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టా అంటూ పాపులార్టీ ఉన్న సైట్స్ అన్నింటిలో యాక్టర్లందరూ ఓ పేజ్ ఓపెన్ చేసుకుంటున్నారు. క్రేజ్ ఫిగర్ దాటినప్పుడల్లా ఫాలోవర్స్ అందరికీ ఓ థ్యాంక్స్ చెబుతూ స్పెషల్ గా డిజైన్ చేసిన ఓ పోస్ట్ పెట్టేస్తున్నారు. మొన్న బన్నీ.. సమంతా ట్విట్టర్ అభిమానులకి ధన్యవాదాలు చెప్పుకొన్నారు. ఇప్పుడు కీర్తీ సురేష్ వంతు వచ్చింది. ఫేస్ బుక్ పేజీలో కీర్తీని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య ఫైవ్ మిలియన్స్ మార్క్ దాటేసింది.

అల్రెడీ కాజల్ కి 2 కోట్ల మంది.. రకుల్.. సమంతాకి 60+ లాక్స్ లో ఉన్నారుగా కీర్తీకి యాభైయేగా అనిపించొచ్చు. కానీ కాజల్ టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ. రకుల్.. సమంతా కూడా 6 ఏళ్లకి పైగా సీనియర్సే. సో వాళ్లకి అంతమంది ఫ్యాన్స్ ఉండటంలో వింతలేదు. కానీ మొన్న మొన్ననే కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తీ షార్ట్ స్పాన్ లో 50 లక్షలమందిని ఫాలోవర్స్ గా తనవైపు టర్న్ చేసుకుందంటే గ్రేటే మరి. పైగా పవన్ తో యాక్ట్ చేస్తున్నానని ఓ మెసేజ్ పెట్టే సరికి ఓవర్ నైట్ లో లక్షకి పైగా మంది కీర్తీని ఐ వానా ఫాలో యూ అనేశారు. అంటే ఇది జస్ట్ బిగినింగే. మూవీ సెట్స్ కెళ్లి రిలీజయ్యే సరికి ఈ ఫిగర్ ఇంకెంత రీచ్ అవుతుందో జస్ట్ ఇమాజిన్. ఆల్ ద బెస్ట్ కీర్తీ

,  ,  ,  ,  ,