Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 15:09:24
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు-మురుగదాస్ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త కబురు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు అవతారం మార్చడం తెలిసిన సంగతే. అతను ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని కూడా కన్ఫమ్ అయింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తమిళంలోనూ డబ్బింగ్ కూడా చెప్పబోతున్నాడన్నది లేటెస్ట్ న్యూస్. తాజాగా వీటన్నింటికంటే కూడా అత్యంత ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. మహేష్-మురుగ సినిమాలో నయనతార ఓ కీలక పాత్ర పోషిస్తోందట. ఆమెది ఓ ప్రత్యేకమైన పాత్ర అని చెబుతున్నారు. మురుగదాస్ ఆ పాత్రను వెరైటీగా డిజైన్ చేశాడట.

ముందు సినిమా మొదలుపెడుతున్నపుడు నయన్ ను అనుకోలేదట కానీ.. ఆ తర్వాత మురుగదాస్ ఈ పాత్రను తీర్చిదిద్ది నయన్ ను అడగ్గా ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తమిళంలోనూ ఒకేసారి విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఏదైనా స్పెషల్ అట్రాక్షన్ ఉండాలన్న ఉద్దేశంతో నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమిళ ప్రేక్షకులకు పరిచయం లేదు. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ పాత్ర చేస్తుండగా.. నయన్ కూడా యాడ్ అయితే అదనపు ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. నయన్ ఇంతకుముందు మురుగదాస్ తీసిన ?గజిని? సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఆ పాత్ర ఆమె కెరీర్ కు బాగా ఉపయోగపడింది. ఆ కృతజ్నతతోనే మురగ లేటెస్ట్ మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,