Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Sep-2016 11:01:55
facebook Twitter Googleplus
Photo

కొందరు హీరోలు యావరేజ్ సినిమాలతో కూడా అలవోకగా రూ.50 కోట్ల షేర్ సాధిస్తున్న టైంలో.. ఒక్కసారి కూడా ఆ క్లబ్బులోకి చేరలేక తెగ ఇబ్బంది పడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. ఐతే సరైన సినిమాలు పడక అతను అలా ఇబ్బంది పడ్డాడు తప్పితే.. ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి.. అతడి బాక్సాఫీస్ స్టామినా గురించి తక్కువ అంచనా వేయడం సరికాదని ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లిచ్చిన ఘనత అతడి సొంతం. అందుకే సరైన సినిమాల కోసం వెయిట్ చేశాడు ఎన్టీఆర్. రొటీన్ మాస్ మసాలా సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాక కొంచెం రూటు మార్చి చేసిన ?టెంపర్? అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. చాన్నాళ్ల తర్వాత సక్సెస్ చూసిన ఉత్సాహంలో ఎన్టీఆర్ మరో వైవిధ్యమైన సినిమా చేశాడు. అదే.. ?నాన్నకు ప్రేమతో?. ఈ సినిమా ఎన్టీఆర్ ను పూర్తి భిన్నంగా ప్రెజెంట్ చేయడమే కాదు.. అతడిని ఏళ్లుగా ఊరిస్తున్న యాభై కోట్ల క్లబ్బును కూడా అందుకునేలా చేసింది. ఇప్పుడు ?జనతా గ్యారేజ్?తో ఎన్టీఆర్ రేంజే మారిపోయింది.

?జనతా గ్యారేజ్?కు డివైడ్ టాక్ వచ్చినా సరే.. రూ.75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందంటే ఎన్టీఆర్ స్టామినా ఏంటో అంచనా వేయొచ్చు. ఈ సినిమాకు కొన్ని అంశాలు కలిసొచ్చిన మాట వాస్తవమే కానీ.. అయినప్పటికీ ఆ కలెక్షన్లు అనూహ్యమే. ఎన్టీఆర్ లీగ్ మారిందనడానికి ఈ కలెక్షన్లే రుజువు. ఇకపై యాభై కోట్ల క్లబ్బు గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు తారక్. యావరేజ్ సినిమాలతో సైతం అతను ఈ క్లబ్బును ఈజీగా అందుకోగలడు. సినిమా హిట్టయితే రూ.60 కోట్లు.. సూపర్ హిట్ అయితే రూ.80 కోట్లు.. బ్లాక్ బస్టర్ అయితే రూ.100 కోట్లు అందుకోగల స్థాయిలో ఉన్నాడు ఎన్టీఆర్ ప్రస్తుతం. తారక్ అసలు సత్తా ఏంటన్నది ఇప్పుడే తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఎన్టీఆర్ స్టామినాను తక్కువ అంచనా వేసిన వాళ్లందరూ ఇక అభిప్రాయం మార్చుకుంటారు.

,  ,  ,  ,  ,