Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2017 14:59:07
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రామిసింగ్ హీరోగా నిఖిల్ మరోసారి తన సత్తా చాటాడు. కొత్త తరహా కథలతో నిఖిల్ సెలక్టివ్ గా చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ కు అనుకూలంగా లేని పరిస్థితుల్లో సినిమా విడుదలైనా కలెక్షన్లు రాబట్టడం అంత సులువేం కాదు. నిఖిల్ ఇంతకుముందు సినిమా ఎక్కడకు పోతావు చిన్నవాడా డీమానిటైజేషన్ టైంలో రిలీజ్ అయింది. ఆ టైంలో థియేటర్లన్నీ దాదాపుగా ఖాళీ. అయినా ఎక్కడకు పోతావు చిన్నవాడా మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. తాజాగా బాహుబలి థియేటర్లలో ఉండటంతో కొత్త సినిమాలేవీ థియేటర్లకు రావడం లేదు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు నిలబడటం లేదు. ఈ టైంలో నిఖిల్ కొత్త సినిమా ‘కేశవ’కు మంచి ప్రేక్షకాదరణే లభిస్తోంది.

కేశవ రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 114 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ఈ సినిమా నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తన తల్లిదండ్రులను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే రొటీన్ కథే అయినా డైరెక్టర్ సుధీర్:వర్మ సినిమాను ఇంట్రస్టింగ్ తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులకు నచ్చింది. అందరికీ గుండె ఎడమవైపున ఉంటే ఈ సినిమాలో హీరోకి గుండె కుడివైపు ఉంటుంది. దీంతో ఎక్కువగా ఆవేశానికి.. కోపానికి గురవకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇదే పాయింట్ ను ట్రైలర్ ద్వారానే బాగానే కనెక్టవగలిగేలానే చెప్పారు. దీంతో ఈ వీకెండ్ కేశవకు బాగానే కలిసొచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లిచూపులు ఫేం రీతూవర్మ నటించింది.

కేశవ హిట్ టాక్ తో నిఖిల్-సుధీర్ వర్మ వారిద్దరి ఖాతాలో మరో హిట్ జమ చేసుకున్నట్లయింది. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో 2013లో వచ్చిన స్వామి రారా సినిమా డీసెంట్ హిట్ కొట్టింది.

,  ,  ,  ,  ,