Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 11:28:12
facebook Twitter Googleplus
Photo

ఖైదీ నెం. 150... మెగాస్టార్ చిరంజీవి మరోసారి వెండితెర ప్రవేశం చేస్తున్న సినిమా. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు మొదలైన తరువాత ఒకెత్తు అన్నట్లు ఉంది యవ్వారం. ఎందుకంటే మొదలైన వెంటనే ఇక లేటనేదే లేకుండా నిర్విరామంగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. గ్యాప్ ఇవ్వకుండా చిరంజీవి సీన్లు - ఫైట్లు - పాటలు అంటూ కుమ్మేశారు.

యురోప్ లో పాటల షూటింగ్ కు వెళ్లడానికి ముందే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్ లో క్లయమ్యాక్స్ ఫైట్లను ఫినిష్ చేశారు ఖైదీ నెం 150 టీమ్. ఆ తరువాత స్లొవేనియా రాజధాని లుబ్లానాలో ఒక పాట.. అలాగే క్రొయేషియాలోని అందమైన నగరం డుబ్రోవనిక్ లో మరోపాటను షూట్ చేశారు. గత సాయంత్రంతో ఆ పాట షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇక ఇండియా తిరిగొచ్చేస్తున్న ఖైదీ టీమ్.. వచ్చీ రాగానే సినిమా క్లయమ్యాక్స్ లో వచ్చే కొన్ని కోర్టు సీన్లను కంప్లీట్ చేయాల్సి ఉందట. ఆ సీన్లను పూర్తి చేస్తే ఇక సినిమా మొత్తంగా రెడీ.

బహుశా చివరి రోజు వరకు షూటింగ్ చేస్తున్న హీరోలందరూ ఇప్పుడు మెగాస్టార్ ప్లానింగ్ అండ్ టైమింగ్ చూసి కాస్త నేర్చుకోవాల్సిందే. ఎప్పుడో జనవరి 13న సినిమా రిలీజ్ చేయడానికి.. అప్పుడే 50 రోజుల ముందు మొత్తం షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రమోషన్లకు వండర్ ఫుల్ గా బోలెడంత గ్యాప్ దొరికింది. ఎంతైనాసరే ఇది అద్భుతం కదూ.

,  ,  ,  ,  ,  ,