Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jan-2017 11:16:09
facebook Twitter Googleplus
Photo

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయి.. ప్రస్తుతం కెరీర్ లో కీలక దశలో ఉన్నాడు సునీల్. ప్రయోగాల జోలికి పోకుండా.. కమర్షియల్ యాంగిల్ లో కామెడీ సినిమాలు చేసుకుంటున్నాడు. విపరీతంగా ఆడేయకపోయినా.. ఒకట్రెండు సినిమాలకు తప్ప నిర్మాతలకు పెద్దగా నష్టాలు మిగల్చకపోవడంతో.. సునీల్ తో సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్స్ ఉత్సాహంగానే ఉన్నారు.

తాజాగా సునీల్ కొత్త కారుకు ఓనర్ అయ్యాడు. స్కోడా లూరిస్ వెహికల్ ను కొనుగోలు చేసిన ఈ కామెడీ హీరో.. తన కారుకు ఫ్యాన్సీ నెంబర్ తగిలించుకున్నాడు. 40 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే ఈ కారును.. హైద్రాబాద్ లోని మలక్ పేటలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సునీల్. టీఎస్11ఈజే 2345 ను సునీల్ కారుకు కేటాయించింది తెలంగాణ ఆర్టీఏ శాఖ. ఈ రిజిస్ట్రేషన్ కోసం సునీల్ 10వేల రూపాయల డీడీ చెల్లించగా.. కొత్త కారుతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చాడు సునీల్.

గతేడాది కృష్ణాష్టమి.. ఈడు గోల్డ్ ఎహె.. జక్కన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సునీల్.. ఒక్క మూవీతో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం మలయాళ కామెడీ మూవీ టూ కంట్రీస్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు సునీల్. ఎన్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే మల్లూవుడ్ లో బ్లాక్ బస్టర్ కావడంతో.. ఇక్కడ కూడా బాగానే ఆసక్తి కలిగిస్తోంది.

,  ,  ,  ,  ,