Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2016 11:50:00
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. యూట్యూబ్ రికార్డులకు బ్రేక్ పడ్డం లేదు. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మొదలైన ఈ రికార్డుల వరద.. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' లిరికల్ వీడియోతో పీక్ స్టేజ్ కి వచ్చేసింది. ఖైదీ నంబర్ 150 టీజర్ కి ఇప్పటివరకూ వచ్చిన వ్యూస్ 6.3 మిలియన్లు.

20 రోజుల్లో ఓ టీజర్ ఇన్ని వ్యూస్ సాధించడమే రికార్డ్ అంటే.. 10 రోజుల క్రితం రిలీజ్ క్రితం రిలీజ్ అయిన అమ్మడు సాంగ్ కి ఇప్పటి వరకూ వచ్చిన వ్యూస్.. 6.6 మిలియన్లు. అంటే టీజర్ ని మించిపోయి ఆడియో సాంగ్ వ్యూస్ సాధించేసి రికార్డ్ సృష్టించేసింది. ఒక ఆడియో సాంగ్ కి పది రోజుల్లో ఇన్ని వ్యూస్ రావడం అనే రికార్డ్ చిరంజీవికి తప్ప మరెవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. ట్యూన్ కాపీ లాంటి విమర్శలు ఎన్ని ఉన్నా.. మెగాస్టార్ క్రేజ్ కి ఇది ఎగ్జాంపుల్. ఈ లెక్కన సినిమా రిలీజ్ అయేందుకు ఇంకా 15 రోజుల టైం ఉంది కాబట్టి.. అమ్మడు సాంగ్ కి కోటి వ్యూస్ దాటిపోవడం పెద్ద విశేషమేమీ కాదు.

ఇక నాలుగు రోజుల క్రితం విడుదలైన సుందరి సాంగ్ కి అయితే.. ఇప్పటికే 3.1 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఖైదీ పాటలను తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో.. మెగా మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,