Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 13:47:40
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ 150 సినిమాలు.. అన్నిటికీ కలిపీ ఒకేసారి ట్రిబ్యూట్ ఇవ్వడం సాధ్యమేనా? అసాధ్యం అనే అనిపిస్తుంది కానీ.. ఓ వీడియో గేమ్ ద్వారా దీన్ని సుసాధ్యం చేశారు. బాలీవుడ్ లో సినిమా రిలీజ్ తో పాటు వీడియో గేమ్ ను కూడా లాంఛ్ చేసి.. మార్కెటింగ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉండగా.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ కు చిరు ద్వారానే ఆద్యం పలుకుతున్నారు.

'MEGA 150' పేరుతో డిజైన్ చేసిన ఈ గేమ్ ను.. ఖైదీ నిర్మాతలు కాకుండా.. ఇతర గేమ్ మేకర్స్ రూపొందించడం విశేషం. తాజాగా ఈ గేమ్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ నటించిన సినిమాల్లోని పాత్రలను బేస్ చేసుకుని ఈ గేమ్ డిజైనింగ్ జరగగా.. 2 వాల్యూమ్స్ లో ఈ గేమ్ లభ్యం కానుందట. అంటే.. దాదాపు మొత్తం అన్ని సినిమాల్లోని పాత్రలు ఈ గేమ్ లో కనిపించే ఛాన్స్ ఉంది.

ఖైదీ.. అడవి దొంగ.. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రాల్లో మెగాస్టార్ రూపాన్ని గ్రాఫిక్స్ లో చూపించడంతో ప్రారంభించి.. కొండవీటి దొంగ గెటప్ తో ఈ టీజర్ ను ఫినిష్ చేసి.. చివర్లో 'బాస్ ఇన్ గేమ్.. మెగా150' అంటూ ఫినిష్ చేసిన తీరు మాత్రం సూపర్బ్ గా ఉంది. మొత్తానికి మెగాస్టార్ ని వీడియో గేమ్ లోకి ఈ టైంలో తీసుకొచ్చేయాలన్న యాప్ డెవలపర్స్ ఐడియా.. సూపర్బ్ గా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది.

,  ,  ,  ,  ,