Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 16:02:33
facebook Twitter Googleplus
Photo

కాలం చేసే మేజిక్ ఇలానే ఉంటుంది. ఒకప్పుడు డిమాండ్లు పెట్టి మరీ వసూలు చేసిన చిన్నది ఇప్పుడు టైం పుణ్యమా అని ఫ్రీగా నటించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతోందట. ఇంతకీ.. ఎవరా భామ అంటారా? అక్కడికే వస్తున్నాం. ఖడ్గం సినిమాలో మెరుపులా మెరిసి.. కొన్ని తెలుగు సినిమాలో ఐటమ్ గా కసెక్కించిన కిమ్ శర్మ గుర్తుందా? ఇప్పుడు చెప్పేదంతా ఆ భామ గురించే.

ఈ 37 ఏళ్ల ఆంటీ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో ఉన్నట్లుగా చెబుతారు. కెరీర్ మాంచి పీక్ మీద ఉన్నప్పుడు సినిమాల నుంచి దూరమై కెన్యాకి చెందిన వ్యాపారవేత్త ఆలీ పంజాబీని పెళ్లాడింది. కొంతకాలం వీరి కాపురం బాగానే ఉన్నా.. వేరే అమ్మాయి కారణంగా కిమ్ ను ఆలీ రీసెంట్ గా వదిలేశారని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కిమ్ ఉందన్న వార్తలు వచ్చినప్పటికీ.. అవన్నీ ఉత్త అబద్ధాలేనని తేల్చి చెప్పింది. లోగుట్టు ముచ్చట ఏమైనా కానీ.. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని తన సత్తా చాటాలని మాత్రం తెగ తొందరపడుతోందట. ఇందుకోసం బంపర్ ఆఫర్ ను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చక్కటి అవకాశం లభిస్తే.. ఫ్రీగా చేసేందుకు సైతం తాను సిద్ధమని ఆమె చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క ఛాన్స్ తో తన సత్తాను చూపించి.. గతంలో మాదిరి బిజీ కావాలని భావిస్తోందట. సినిమా కానీ టీవీ కానీ ఏదైనా ఒక ఛాన్స్ కోసం అమ్మడు పడుతున్న తపన చూసినోళ్లు అవాక్కు అవుతున్నారు. ఇదిలా ఉంటే.. అమ్మడు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అర్జున్ ఖన్నాతో డేటింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

,  ,  ,  ,