Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jan-2017 12:08:44
facebook Twitter Googleplus
Photo

చడీచప్పుడు లేకుండా తన కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో అతను జవాన్ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ తో ఘనంగా ఆరంభమైందీ సినిమా. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. అరుణాచల్ క్రియేషన్స్ బేనర్ మీద కృష్ణ అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా దీనికి పని చేసే కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెల్లడించాడు బి.వి.ఎస్.రవి. ఐతే ఈ సినిమాకు పని చేయబోయే వాళ్లందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న పేరు.. విలన్ ప్రసన్నదే. ఈ ప్రసన్న ఎవరో కాదు.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్నేహ భర్త. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రసన్నకు తమిళంలో మరీ గొప్ప అవకాశాలేమీ రాలేదు. ?అంజాదే? అనే సినిమాలో అతను అవార్డ్ అద్భుతమైన విలనీతో మెస్మరైజ్ చేశాడు. ఆ సినిమాకు అనేక అవార్డులు కూడా అందుకున్నాడు. ఆపై అతను నెగెటివ్ రోల్స్ చేసింది లేదు.

అప్పట్లో నాగార్జున సినిమా ?భాయ్?లో అంతగా ప్రాధాన్యం లేని తమ్ముడి పాత్ర పోషించాడు ప్రసన్న. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాపవడంతో అతడి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు. ఇప్పుడు ?జవాన్? లాంటి క్రేజీ ప్రాజెక్టులో విలన్ పాత్ర చేయబోతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. సాయిధరమ్ కంటే అందంగా కనిపించే ప్రసన్న.. అతడి సినిమాలో విలనీ ఎలా పండిస్తాడో చూడాలి. ఈ చిత్రంలో తేజు సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. కె.వి.గుహన్ ఛాయాగ్రాహకుడు.

,  ,  ,  ,  ,