Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 10:58:43
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 మూవీ.. సెన్సేషన్స్ కి సెంటర్ పాయింట్.. కలెక్షన్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. నాలుగు రోజులకే 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి.. తిరుగులేని రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పుడప్పుడే వీటిని టచ్ చేయడం ఎవరి తరం కాదనే స్థాయిలో వసూళ్లు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు ఎవరైనా సంతోషించాల్సిందే కానీ.. తమన్నా తెగ ఫీలయిపోతోంది. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీరుపై తెగ బాధపడిపోతోందట కూడా.

బాహుబలిలో లీడ్ కేరక్టర్స్ లో తమన్నా కూడా ఉంది. మొదటి భాగంలో కీలకమైన పాత్రలోనే కనిపిస్తుంది. రెండో భాగంలో కూడా మిల్కీ ఉంటుంది కానీ.. కొన్ని ఫ్రేమ్స్ కి మాత్రమే పరిమితం. అంతా కలిపి స్క్రీన్ టైం నిమిషంన్నర లోపే తమన్నా కేరక్టర్ కనిపిస్తుంది. నిజానికి బాహుబలి2 రిలీజ్ కి ముందు.. క్లైమాక్స్ లో తనదే కీలక పాత్ర అని చెప్పుకుంది మిల్కీ బ్యూటీ. కానీ థియేటర్లలో మూవీ చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. కేమియో రోల్ కంటే తక్కువగా తమ్ము రోల్ ఉంటుంది.బాహుబలి2 కోసం కత్తి యుద్ధాలు.. గుర్రపు స్వారీలు నేర్చుకుని మరీ యాక్టింగ్ చేసేసింది తమన్నా. కానీ ఫైనల్ కట్ లో తమన్నా రోల్ మొత్తం ఎగిరిపోయింది.

సరిగ్గా ఈ పాయింటే మిల్కీ బ్యూటీని అప్ సెట్ చేసిందట. ఇదే విషయంపై రాజమౌళితో చిన్నపాటి వాగ్వివాదం కూడా జరిగిందని అంటున్నారు. అయితే ఇవన్నీ కాదంటూ తమన్నా ఖండించింది కాని.. తమిళనాట ఒక మీడియా హౌస్ తమన్నాకు ఫోన్ చేసి.. అప్పట్లో నువ్వు క్లయ్ మ్యాక్స్ లో చింపేస్తున్నా అన్నావ్ గా అంటూ పంచ్ వేయగా.. అవును రాజమౌళి హర్ట్ చేశాడు అంటూ నిజం చెప్పేసిందట. తరువాత కాల్ చేసి.. ఆ బైట్ ఇప్పుడు వేయకండి ప్లీజ్ అని కూడా చెప్పిందట. ఇప్పుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్.

,  ,  ,  ,  ,