Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Oct-2016 11:29:04
facebook Twitter Googleplus
Photo

దక్షిణాదిన అడ్వాన్స్డ్ గా ఉండే ఇండస్ట్రీ ఏదంటే కోలీవుడ్డే అని ఒప్పుకుని తీరాలి. వాళ్లు ఎంచుకునే కథాంశాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. మనం ఇప్పుడు కొత్తదనం కొత్తదనం అంటున్నాం కానీ.. అక్కడ చాలా ఏళ్ల నుంచే వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. వాటిలో చాలా సినిమాలు తెలుగులోకి కూడా అనువాదమై ఆదరణ పొందాయి. ఐతే ఎంత వైవిధ్యమైన సినిమాలు తీసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. గత కొన్నేళ్లలో రాజమౌళి తన సినిమాలతో తమిళ దర్శకులందరికీ సవాలు విసిరాడు. మగధీర - ఈగ లాంటి సినిమాలతో కోలీవుడ్ కు సవాలు విసిరాడు జక్కన్న. ఇక ?బాహుబలి? సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకూ సవాలు విసిరాడు జక్కన్న ఈ సినిమాతో.

రాజమౌళికి ?బాహుబలి?తో వచ్చిన పేరు చూసి కోలీవుడ్ జనాలు కుళ్లుకుని ఉంటారనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ?బాహుబలి?ని కొట్టే సినిమా తీయాలని వాళ్లు పట్టుదలతో ఉన్నారు. గత ఏడాది వచ్చిన విజయ్ సినిమా ?పులి?ని బాహుబలికి దీటైన సినిమా అన్నారు. కానీ దాని ఫలితం ఏమైందో చెప్పాల్సిన పని లేదు. ?బాహుబలి? కాలి గోటికి కూడా అది సరిపోలేదు. ఇప్పుడిక తమిళ జనాల కళ్లు ?కాష్మోరా? మీద పడ్డాయి. దీన్ని కూడా ?బాహుబలి?కి దీటైన సినిమా అంటూ నెత్తికెత్తుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా చర్చనీయాంశం అవుతోంది. ట్రైలర్ చూస్తే గొప్ప ప్రయత్నమే చేసినట్లుగా అనిపించింది. కానీ సినిమాగా చూస్తే ఎలా ఉంటుందో చెప్పలేం. ఇంకో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి ఇది మరో ?బాహుబలి? అవుతుందా.. ?పులి?లా మారుతుందా చూద్దాం.

,  ,  ,  ,  ,